ఉపాసన ప్రేమికుల రోజు ట్వీట్ వైరల్

మెగా కోడలు ఉపాసన ఎప్పుడు వార్తల్లో ఏదో ఒక వార్త తో మీడియా లో నిలుస్తూనే ఉంటుంది. సోషల్ మీడియా లోను ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ సామజిక అంశాలతో పాటు చరణ్ సినిమాల గురించి ప్రస్తావిస్తూ అభిమానులను, నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఈరోజు ప్రేమికుల రోజు సందర్భాంగా ఆమె చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

మానవ సంబంధాలు బలపడాలంటే నిన్ను నువ్వు ప్రేమించడమే తారక మంత్రం అని ఉపాసన అంటున్నారు. ఈ వాలంటైన్స్‌ డే రోజున బంధాలను మరింత బలంగా మార్చాలనుకుంటున్నారా అని ప్రశ్నించిన ఉపాసన.. అందుకు కొన్ని సూచనలు కూడా చేశారు. ‘మొదట నిన్ను నువ్వు ప్రేమించడానికి ప్రయత్నించు. అప్పుడే ఎలాంటి షరతులు లేకుండా ఇతరులను ప్రేమించే దృష్టి అలవడుతుంది. నీకు నువ్వు ప్రేమ లేఖ రాసుకో. నీకు సంతోషం కలిగించే పనులు మాత్రమే చేయి. నీ మొత్తం ప్రపంచం మార్పుకు సాక్ష్యంగా నిలువు’ అని తెలిపింది.