Site icon TeluguMirchi.com

వావ్ : ‘అమేజింగ్ భార్యలు” అదిరిపోయారుగా…

Namrata--Upasana-and-Snehaకొన్ని సార్లు కొన్ని ఫొటోస్ అభిమానులకు భలే కిక్ ఇస్తాయి..తాజాగా అలాంటి ఫోటోనే ఇప్పుడు మెగా , సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని సంబరాలు చేసుకునేలా చేస్తుంది. వివరాల్లోకి వెళ్తే..

ఆగస్ట్ 22 న చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి..ఫ్యాన్స్ ని మెగా హీరోలు సంతోషపరిస్తే , సినీ , రాజకీయ ప్రముఖులను పార్కు హయాత్ హోటల్ లో చిరంజీవి గ్రాండ్ పార్టీ ఇచ్చి సంతోష పరిచాడు. ఈ పార్టీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సతిసమేతంగా రావడం అందరి సంతోష పరించింది. మహేష్ హీరోలతో బిజీ గా ఉంటే నమృత మాత్రం మెగా కోడళ్ల తో బిజీ అయ్యింది.

చిరంజీవి కోడలు ఉపాసన , అల్లు అరవింద్ కోడలు స్నేహ లతో నమ్రత భలే టైమ్ స్పెండ్ చేసిందట. ఆమె ఎలా టైమ్ స్పెండ్ చేసిందో ఉపాసన తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసింది. స్నేహ , ఉపాసన ల చేతులు దగ్గరికి తీసుకొని నమృత కూడా ఓ చేయిసి ఎంత జోవియల్ గా ఎంజాయ్ చేసిందో చూడండి అంటూ వీరి ముగ్గురి కలిసి దిగిన ఫోటో పోస్ట్ చేసింది.

అంతే కాదు ఈ ఫోటో కు ”అమేజింగ్ భార్యలు.. అదిరిపోయారు” అనే ఓ ట్యాగ్ లైన్ కూడా పెట్టింది. చివర్లో మాత్రం ‘వెయిటింగ్ ఫర్ శ్రీయ భూపాల్” అని పెట్టి అందర్నీ అయోమయం లో పడేసింది. ఆ శ్రీయ ఎవరో అని ఆరా తీయగా అక్కినేని అఖిల్ ప్రేమించిన అమ్మాయి అని తేలింది. మొత్తానికి ఉపాసన మెగా కోడలనా మజాకానా అనిపించుకుంది.

Exit mobile version