ఏసీ రూముల నుండి బయట కాలు పెట్టని ఉపాసన హైద్రాబాద్‌లో వ్యాపారాలు కూడా పక్కన పెట్టి చెర్రీ దగ్గరకు వెళ్లిపోయింది. పల్లెటూరి అందాలు బాగున్నాయి అని చరణ్ చెప్పాడో, లేదా చరణ్ మీదకు మనస్సు లాగిందో కానీ ఈ అమ్మడు అన్నీ వదిలేసుకుని పల్లెటూరుకు బయల్దేరింది. పల్లెటూరి కాలువ గట్ల దగ్గర ఉన్న అందాలను వీక్షిస్తూ, షూటింగ్‌ను ఎంజాయ్ చేస్తూ ఈ అమ్మడు చరణ్‌తోనే గడిపింది. పచ్చని పొలాలు, కాలువ గట్లను చేస్తు ఉపాసన తెగ మురిసిపోయిందట. ఈ నేపథ్యంలో భీమవరంలోని మావుళ్లమ్మ అమ్మవారిని రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన దర్శించుకున్నారు.