చరణ్‌ కోసం అన్ని వదిలేసి పల్లెకు చేరిన ఉపాసన

ram charan upasanaమెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్‌ గతకొంత కాలంగా రాజమండ్రిలో జరుగుతోంది. తాజాగా షూటింగ్‌ కొల్లేరుకోట సమీపంలో జరుగుతుంది. చరణ్‌ ఇలా పల్లెటూరిలో చాలా బిజీగా ఉండగా ఉపాసన ఒక్కతే హైద్రాబాద్‌లో ఒంటరిగా ఉంది. అంతేకాకుండా ఒంటరిగా వీకెండ్స్‌ అంటూ తెగ ఫీలవుతూ సోషల్‌ మీడియా ద్వారా తెలుపుతోంది. దాంతో చెర్రీ మొన్న హైద్రాబాద్‌ వచ్చి ఉపాసనతో కాసేపు గడిపి మరుసటి రోజే మళ్లీ తిరుగు ప్రయాణం అయ్యాడట. ఇకపోతే చరణ్‌ వదిలి ఉండలేకపోతున్న ఉపాసన చరణ్‌తో వెళ్లడానికే సిద్దమయ్యింది.

ఏసీ రూముల నుండి బయట కాలు పెట్టని ఉపాసన హైద్రాబాద్‌లో వ్యాపారాలు కూడా పక్కన పెట్టి చెర్రీ దగ్గరకు వెళ్లిపోయింది. పల్లెటూరి అందాలు బాగున్నాయి అని చరణ్‌ చెప్పాడో, లేదా చరణ్‌ మీదకు మనస్సు లాగిందో కానీ ఈ అమ్మడు అన్నీ వదిలేసుకుని పల్లెటూరుకు బయల్దేరింది. పల్లెటూరి కాలువ గట్ల దగ్గర ఉన్న అందాలను వీక్షిస్తూ, షూటింగ్‌ను ఎంజాయ్‌ చేస్తూ ఈ అమ్మడు చరణ్‌తోనే గడిపింది. పచ్చని పొలాలు, కాలువ గట్లను చేస్తు ఉపాసన తెగ మురిసిపోయిందట. ఈ నేపథ్యంలో భీమవరంలోని మావుళ్లమ్మ అమ్మవారిని రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన దర్శించుకున్నారు. ram charan upasana 1