Site icon TeluguMirchi.com

ఉపాసనను చరణ్ అందుకే పెళ్లి చేసుకున్నాడట..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..తనను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలుసా అంటూ ఉపాసన పోస్ట్ చేసింది. ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసనల దక్షిణాఫ్రికాలో విహార యాత్రను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రకు సంబంధించి ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో ఆ విశేషాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తున్నారు.

తాజాగా ఉపాసన సింహం పిల్లలతో ఆడుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు ఇపుడు తెలిసిందా మిస్టర్ సి అదే నండి తన భర్త చరణ్ తనకు ఎందుకు పెళ్లి చేసుకున్నాడో అంటూ చెప్పుకొచ్చింది. సింహం పిల్లలను పట్టుకునేంత తన ధైర్యాన్ని చూసే రామ్ చరణ్‌ తనను మ్యారేజ్ చేసుకున్నట్టు చెప్పింది.

ఇక చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. మరో వారంలో చరణ్ సెట్ లో జాయిన్ కానున్నాడు.

Exit mobile version