Site icon TeluguMirchi.com

ఉగ్రం ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్‌ !


అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘ఉగ్రం’. నాంది సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు.

ఏప్రిల్ 21న సాయంత్రం 06.03 గంటలకు ఖమ్మం లోని లేక్ వ్యూ క్లబ్.. సీక్వెల్ లో ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ మూవీలో నరేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. కాగా సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ధి నిర్మిస్తున్న ఈ సినిమాలో నరేష్‌కు జోడీగా మిర్నా నటిస్తుండగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version