వర్మపై దుబాయ్ లో ఎదురు దాడి

ram-gopal-verama-the-attacksరామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘26/11 ఇండియాపై దాడి’ చిత్రానికి దుబాయ్
లో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన దుబాయ్
సెన్సార్ బోర్డ్ చిత్ర ప్రదర్శనకు అనుమతిని నిరాకరించింది. దీంతో ఈచిత్రం అక్కడ విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ చిత్ర ప్రదర్శన వల్ల లష్కరే తీవ్రవాదుల ఏమైనా అఘాయిత్యానికి పాల్పడుతారనే భయంతోనే యు.ఎ.ఈ ఈచిత్ర ప్రదర్శనకు అనుమతి నిరాకరించినట్లు సమాచారం. నవంబర్ 26, 2008న 10 మంది పాకిస్థాన్ లష్కరే తోఇబా ఉగ్రవాదులు ముంబై నగరంపై జరిపిన దాడిని కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు ఈ చిత్రం తో దర్శకుడు వర్మ. ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన ఇండస్ట్రీ పెద్దలు, వర్మ ఆప్తులు సినిమా బాగా వచ్చిందని కితాబిచ్చేశారు. అలుంబ్రా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో సంజీవ్ జైస్వాల్ అనే నటుడు తీవ్రవాది కసబ్ పాత్రలో కనిపిస్తుండగా, విలక్షణ నటుడు నానా పాటేకర్ ముంబై నగర పోలీస్ ఆఫీసర్ రాకేష్ మారియ పాత్ర పోషిస్తున్నారు.