బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా భారీ చిత్రాలు నిర్మించే బండ్ల గణేష్ మరో బ్లాక్ బస్టర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మలయాళంలో దిలీప్, మమతా మోహన్ దాస్ జంటగా నటించిన టూ కంట్రీస్ చిత్రం సూపర్ డూపర్ హిట్టై 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అంతటి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న ఆ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు నిర్మాత బండ్ల గణేష్. టూ కంట్రీస్ చిత్ర తెలుగు హక్కుల్ని విపరీతమైన పోటీ నడుమ దక్కించుకున్నారు. ఇప్పటివరకు ఏ మలయాళ చిత్రానికి కూడా ఇవ్వనంత ఎక్కువ ధరకు టు కంట్రీస్ చిత్ర హక్కుల్ని పొందారు. బడా నిర్మాతలు ఈ చిత్రం కోసం పోటీ పడ్డారు. ఈ చిత్రాన్ని తెలుగులో భారీగా నిర్మించేందుకు బండ్ల గణేష్ సన్నాహాలు చేస్తున్నారు. ఎందుకంటే… పలువురు టాప్ స్టార్స్ ఈ చిత్రంలో నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ…
‘మలయాళ బ్లాక్ బస్టర్ టూ కంట్రీస్ చిత్ర హక్కుల్ని భారీ పోటీ మధ్య దక్కించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రం. అందుకే భారీ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాం. టాలీవుడ్ లో ఉన్న టాప్ స్టార్స్ ఈ సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ చిత్ర నటీనటులు, సాంకేతిక వర్గం గురించి తెలియజేస్తాను’. అని అన్నారు.