Site icon TeluguMirchi.com

వినాయకుడిని మొక్కినందుకు హీరోయిన్‌పై ట్రోల్స్‌

ఇండియాలో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందని మనం అనుకుంటూ ఉంటాం. ముస్లీంల పండుగలకు హిందువులు వారికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇక హిందువుల పండుగల్లో ముస్లీంలు పార్టిసిపెంట్‌ చేస్తారు. కాని కొందరు మాత్రం కరుడు గట్టిన మతతత్వ వాదులు మాత్రం వారి మతం మాత్రమే గొప్పది అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. సెలబ్రెటీల విషయంలో వారు మరీ అతిగా ప్రవర్తిస్తారు. తాజాగా బాలీవుడ్‌ హీరోయిన్‌ సర అలీ ఖాన్‌ పై ముస్లీంలు కొందరు సోషల్‌ మీడియాలో తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇలాంటి సమయంలో సర అలీ ఖాన్‌ ఒక వినాయక ప్రతిమ వద్ద నమస్తారం చేస్తున్నట్లుగా నిల్చుంది. ఆ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో కొందరు ముస్లీంలు సరపై తిట్ల దండకం అందుకున్నారు. పవిత్రమైన మొహరం మాసంలో ఇలా ముస్లీంల మనోభావాలను దెబ్బ తీసే విధంగా చేయడం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు అసలు ముస్లీంవేనా అంటూ తీవ్రంగా మండి పడుతున్నారు. ఈ విషయమై సర అలీఖాన్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Exit mobile version