పవన్‌కళ్యాణ్ గతకొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ పూర్తి స్థాయి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న విషయం తెల్సిందే. మళ్లీ తెర మీదకు రావడానికి జనసేనాని ఆసక్తిగా ఉన్నాడా? లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే పలువురు దర్శక నిర్మాతలు పవన్ కోసం కథలు సిద్దం చేస్తున్నారు కానీ పవన్ స్పందన ఎలా ఉంది అనేది ఇంకా క్లారిటీ లేదు. బాలీవుడ్లో మంచి సక్సెస్ అయిన ‘పింక్’ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించడానికి దిల్‌రాజు హక్కులను సొంతం చేసుకున్నాడు. అయితే ఈ చిత్రంలో బాలయ్య నటిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా పవన్ పేరు వినిపిస్తోంది.
త్రివిక్రమ్ తాజాగా పవన్‌ని కలిసి ‘పింక్’ రీమేక్ గురించి చర్చించినట్టుగా సమాచారం. అయితే ఈ విషయమై పవన్ ఏదీ క్లారిటీ ఇవ్వలేదట. పవన్ ఈ చిత్రంలో నటిస్తే దిల్‌రాజుతో కలిసి త్రివిక్రమ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. పవన్‌ని లాయర్‌గా చూపించడానికి త్రివిక్రమ్ చాలా ప్రయత్నాలు చేశాడని చెప్పవచ్చు. ఈయన పవన్‌కు కాస్త సన్నిహితుడు కావడంతో దిల్‌రాజు ఈ దిశగా రాయబారం పంపించాడు. అయితే పవన్ మళ్లీ మొహానికి రంగు వేసుకుంటాడా? లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.