‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నాడు. గత కొంత కాలంగా దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకి ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే వర్కింగ్ టైటిల్ని కూడా అనుకున్నారు అనుకున్నారు. ఐతే ఇప్పుడీ సినిమాకి సంబధించిన టోటల్ ప్లాన్ మారిపోయింది.
మొదట త్రివిక్రమ్ పొలిటికల్ టచ్ వున్న ఒక ఫ్యామిలీ డ్రామాని అనుకున్నారు. ఈ కధ ఎన్టీఆర్ కి కూడా బాగా నచ్చింది. ఇదే కధని మొదట లాక్ చేశారు. ఐతే ఇంతలో ఇప్పుడు టోటల్ ప్లాన్ చేంజ్ అయింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ మరో పాన్ ఇండియన్ సినిమా చేయాలనే ఆలోచనకి వచ్చారు. ఈ సంగతి త్రివిక్రమ్ కి చెప్పడం, త్రివిక్రమ్ కూడా దానికి ఓకే చెప్పడం జరిగిపోయింది.
త్రివిక్రమ్ దగ్గర ఒక యాక్షన్ డ్రామా ఎప్పటి నుండో వుంది. ఇప్పుడు అదే కధని ఎన్టీఆర్ కోసం రాయడం మొదలుపెట్టారు. ఈ సినిమాకి కూడా భారీ గా ఉండబోతుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కెరీర్లోనే సెకెండ్ హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా త్రివిక్రమ్ సినిమా రాబోతుంది. జూన్ లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళే ఛాన్స్ వుంది.