త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఎవరితో తెలుసా..?

pawan-kalyan-trivikram-srin
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అ..ఆ ‘ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఈ తరుణం లో నెక్స్ట్ త్రివిక్రమ్ సినిమా ఎవరితో ఉంటుంది..? ఎలాంటి సినిమా చేయబోతాడు..? ఎవరి బ్యానర్ లో చేస్తాడు..? అనే ప్రశ్నలు సినీ ప్రేక్షకుల మదిలో కలుగుతున్నాయి..అయితే వీటికి సమాదానం తెలిపాడు నిర్మాత చిన్నబాబు…

ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ కు ఓ కథ వినిపించమని , అది పవన్ కు సైతం ఎంతో నచ్చిందని ఇంకాస్త కథ లో మార్పుల చేయడం కోసం త్రివిక్రమ్ చూస్తున్నాడని చిన్నబాబు చెప్పాడు..దీని బట్టి చూస్తే త్రివిక్రమ్ నెక్స్ట్ ఫిలిం పవర్ స్టార్ తోనెనని అర్ధం అయిపొయింది..జల్సా , అత్తారింటికి దారేది తర్వాత త్రివిక్రమ్ – పవన్ కాంబినేషన్ లో రాబోతున్న మూడో చిత్రం అన్నమాట.