చిరు-త్రివిక్రమ్ సినిమాకు బ్రేక్ పడ్డట్లేనా…!

చిరు,త్రివిక్రమ్ కాంభినేషన్ లో వస్తుందనుకున్న మూవీ అటకెక్కినట్లే కనిపిస్తుంది. త్రివిక్రమ్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లు చూస్తే ఇదే నిజమనిపిస్తుంది. మహేష్ బాబు, వెంకటేష్, చిరంజీవి, ఎన్టీఆర్ సినిమాలు త్రివిక్రమ్ లిస్ట్ లో ఉన్నాయని టాక్ నడుస్తుంది. అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్ ని మళ్ళీ జూనియర్ తోనే ప్లాన్ చేయలని ఈ స్టార్ డైరక్టర్ భావిస్తూన్నాడట. #RRR షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ కూడా జనవరికల్లా ఆ మూవీని ముగించే పనిలో ఉన్నాడు.దీంతో మళ్ళీ త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో 2020 దసరాకు ఓ సినిమాను అందించే ప్రణాళికలు తయారవుతున్నట్లు తెలుస్తోంది.

 

త్రివిక్రమ్ – చిరంజీవి  ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. దీన్ని రామ్ చరణే సెట్ చేసాడని ‘వినయ విధేయ రామ’ ప్రి రిలీజ్ ఈవెంట్లో  చిరంజీవి అన్నారు.  ”దానయ్య ఒక పక్క #RRR తీస్తూనే మరోపక్క నాది త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ను తీయబోతున్నాడని ఆ ఈవెంట్ లోనే చిరు ప్రకటించాడు. అయితే తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్కడ మాటలు లేవు. ఇక అరవింద సమేత తరువాత ఎన్టీఆర్,త్రివిక్రమ్ బాండింగ్ బాగ్ సెట్ అయినట్లు తెలుస్తుంది. అందుకే బన్నీతో సినిమా తరువాత త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమానే ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.