త్రివిక్రమ్ మళ్ళీ తరుణ్ తో చేస్తాడా ?


నువ్వే నువ్వే’తో దర్శకుడిగా పరిచయమయ్యాడు త్రివిక్రమ్. తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ సినిమాకి తరుణ్ హీరో. అప్పటికి తరుణ్ మీడియం హీరో. అయితే త్రివిక్రమ్ మాత్రం మళ్ళీ మీడియం హీరోలతో చేయలేదు. పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు అల్లు అర్జున్ .. ఇపుడు ఎన్టీఆర్.. ఇలా బడా సినిమాలతోనే బిజీ అయిపోయాడు. అయితే ఇలాంటి నేపధ్యంలో త్రివిక్రమ్ ను తాను సినిమా చేయమని అడుగుతానని అంటున్నాడు తరుణ్

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రివిక్ర‌మ్‌కు తనకు మంచి ఫ్రెండ్షిప్ ఉందని తరుణ్ చెప్పుకొచ్చారు. త్రివిక్రమ్‌తో మళ్ళీ మీరు సినిమా ఎప్పుడు చేస్తారు? అని ప్రశ్నిస్తే.. “త్రివిక్రమ్ తో తప్పకుండా చేయాలి. అతను పవన్‌కల్యాణ్‌, మహేశ్‌బాబులతో సినిమా చేస్తున్నాడు. నేను విజయాలు అందుకున్న తర్వాత తనను నాతో సినిమా చేయమంటే బాగుంటుంది. స‌క్సెస్‌లు కొట్టాక త్రివిక్ర‌మ్‌తో నాతో చేయమని అడగను. నాతో సినిమా చెయ్‌ అని చెప్తా, అతనితో నాకంత చనువు ఉంది”అని చెప్పుకొచ్చాడు తరుణ్.