ప‌వ‌న్ కోసం పెన్ను ప‌ట్టిన త్రివిక్రమ్‌?

pavanప‌వ‌న్ కల్యాణ్ – త్రివిక్రమ్ ల‌మ‌ధ్య దోస్తీ మ‌రింత బ‌ల‌ప‌డుతోంది. జ‌ల్సాకి ప‌నిచేస్తున్న స‌మ‌యంలో ఇద్దరి భావాలూ క‌లిశాయి. అత్తారింటికి దారేది.. తో మ‌రింత ద‌గ్గరైపోయారు. అందుకే కోబ‌లి సినిమా కూడా ప్రక‌టించేశారు. ఇప్పుడు గ‌బ్బర్ సింగ్ 2కీ త‌న‌వంతు సాయం చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ స్టార్ రైట‌ర్ డైరెక్టర్ అయిపోయిన త‌ర‌వాత మ‌ళ్లీ పెన్ ప‌ట్టుకొని వేరే సినిమాల‌కు మాట‌లు రాయ‌లేదు. ప‌వ‌న్ కోసం తీన్‌మార్ సినిమాకి మాట‌సాయం చేశాడు. ఇప్పుడు గ‌బ్బర్ సింగ్ 2కి సంభాష‌ణ‌లు రాసే బాధ్యత చేప‌ట్టిన‌ట్టు స‌మాచార‌మ్‌. ప‌వ‌న్ కోరిక మేర‌కు సినిమా అంతా కాక‌పోయినా కొన్ని ముఖ్యమైన స‌న్నివేశాల‌ను త్రివిక్రమ్ సంభాష‌ణ‌లు అందించార‌ట‌. త్రివిక్రమ్ చేయిప‌డింద‌టే.. గ‌బ్బర్ అదుర్స్ అనాల్సిందే.