అజిత్‌తో త్రిష‌

ajith trishaచెన్నై చిన్న‌ది త్రిష‌కు మ‌రో గోల్డెన్ ఛాన్స్ ద‌క్కింది. త్వ‌ర‌లోనే అజిత్‌తో క‌ల‌సి ఆడిపాడ‌బోతోంది. వీరిద్ద‌రూ ఇదివ‌ర‌కు గ్యాంబ్ల‌ర్ చిత్రంలో క‌ల‌సి న‌టించారు. ఇప్పుడు ఇది రెండో చిత్రం. గౌత‌మ్ మీన‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. అయితే త్రిష ఈ సినిమాలో రెండో నాయిక మాత్ర‌మే. మెయిన్ లీడ్ అనుష్క‌కు ద‌క్కింది. గౌత‌మ్‌మీన‌న్ సినిమా కాబ‌ట్టి.. రెండో నాయిక అన్నా స‌రే – ఒప్పేసుకొంది త్రిష‌. ఏమాయ చేశావె త‌మిళ వెర్ష‌న్‌లో త్రిష‌ని గౌత‌మ్‌మీన‌న్ చాలా అందంగా చూపించారు. ఆ అభిమానంతోనే ఈ సినిమాలో న‌టించ‌డానికి త్రిష అంగీక‌రించింద‌ట‌. త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. అన్న‌ట్టు ఇదో థ్రిల్ల‌ర్ చిత్రం. ఘ‌ర్ష‌ణ (వెంక‌టేష్‌), రాఘ‌వ‌న్ (క‌మ‌ల్‌హాస‌న్‌) సినిమాల త‌ర‌హాలో సాగే క‌థ అట‌. మ‌రి ఈ చిత్రంలో కూడా అజిత్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తాడా? లేదా? అన్న‌ది తెలియాలంటే ఇంకొంత‌కాలం వేచి చూడాలి.