రాజకీయాల్లోకి ‘త్రిష’..

Trisha-politicalచెన్నై భామ త్రిష రాజకీయాల్లోకి వస్తుందా..? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు..ఎందుకంటే ఇటీవల ఈ భామ నాకు సీఎం కావాలని ఉంది అంటూ ప్రకటన చేయడం తో , అందరూ త్రిష రాజకీయాల్లోకి రాబోతుందేమో అని మాట్లాడుకుంటున్నారు..

ఇండస్ట్రీ కి వచ్చి 15 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా అమ్మడి హావ ఏ మాత్రం తగ్గలేదు..సీనియర్ హీరోలతో జతకడుతూనే , లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో తన టాలెంట్ చూపిస్తూ ఇంకా అవకాశాలు రాబట్టుకుంటుంది. తాజాగా ధనుష్ సరసన ‘కోడి’ చిత్రం లో నటించింది.. తెలుగు లో ధర్మ యోగి గా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

కాగా ఈ చిత్రం లో రాజకీయనాయకురాలి పాత్రలో త్రిష నటించడం జరిగింది..ఆ పాత్ర ప్రభావమో లేక నిజంగానే రాజకీయాల ఫై ఆసక్తి ఉందో తెలియదు కానీ త్రిష సీఎం కావాలని ఉంది అనడం అందరిలో ఆసక్తి పెంచుతుంది.