Site icon TeluguMirchi.com

బాలయ్యకు జోడిగా ?

ballaya trisha
బాలకృష్ణ హీరోగా ఓ సినిమా సిద్ధమవుతోంది. సత్యదేవ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య సరసన కథానాయిక కోసం చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోంది. బాలయ్య కు జోడిగా ఓ ఇద్దరు హీరోయిన్స్ పరిశీలనలో వున్నట్లు తెలుస్తోంది. త్రిష లేదా శ్రియలలో ఒకరిని హీరోయిన్ గా చేస్తారని ఫిల్మ్‌నగర్ సమాచారం. త్రిషను ఫైనల్ చేసే అవకాశాలే ఎక్కువని యూనిట్ సమాచారం.మొదట బాలయ్యకు జోడిగా హీరోయిన్ అంజలిని అనుకున్నా తర్వాత నిర్ణయం మారింది. బాలకృష్ణ జన్మదినం సందర్భంగా జూన్ 10న సినిమాను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Exit mobile version