మూగ జీవాలంటే, అందులో వీధి కుక్కలంటే త్రిషకు వల్లమాలిన అభిమానం. పెటా సంస్థలో ఆమె కూడా ఓ భాగమే. వీధి కుక్కల్ని దత్తత తీసుకొనేలా ప్రోత్సహించే సంస్థ ఇది. త్రిష కూడా క్యాడ్ బెరీ అనే కుక్కను దాదాపు పదేళ్ల నుంచీ పెంచుకొంటోంది. ఆ క్యాడ్ బరీ సోమవారం చనిపోయింది. దాంతో ఇంట్లో విషాదం అలుముకొంది. క్యాడ్.. నువ్వు లేకుండా ఇంట్లో పార్టీలు ఎలా చేనుకోను. ఇంటికొస్తే పదే పదే నువ్వే గుర్తొస్తావ్…అంటూ త్రిష ట్విట్ చేసింది. అక్కడి నుంచి త్రిషకు ప్రముఖులంతా సంతాప సందేశాలు పంపిస్తున్నారు. క్యాడ్ బరీ ఆత్మకు శాంతి కలగలాని ప్రార్థిస్తున్నారు. మనుషులు చనిపోతేనే పట్టించుకోవడం లేదు. ఇక కుక్క పిల్లలకు సంతాపాలా..? అని అడక్కండి. ఇది త్రిష గారి కుక్కపిల్లమరి..?!