Site icon TeluguMirchi.com

త్రిష కు ఓ కొడుకున్నాడట…!

Trisha-mudu

సౌత్ క్రేజీ భామ త్రిష..సినిమాల పరంగా ఎంత గ్లామర్ ఒలకపోసిన..కుక్కలంటే ఎంతో ఇష్టమనే సంగతి అందరికి తెల్సిందే..ముద్దుగా ఈమెనే జంతు ప్రేమికురాలు అని పిలుస్తుంటారు. వీధి కుక్కల్ని చేరదీయడంలో అమ్మడికి బాగా ఇష్టం. ఎక్కడన్నా దయనీయ స్థితిలో వీధి కుక్కలు కన్పిస్తే, వాటిని ఆదుకోవడం, తగిన ఆహారం దానికి అందివ్వడం, వాటిని సంరక్షణ నిమిత్తం వేరే చోటకి తరలించడం, లేదంటే తన వద్దనే పెంచుకోవడం త్రిషకి బాగా అలవాటు.

త్రిషకి ఆ మధ్యన ఓ కొడుకు వుండేవాడు. వాడి పేరు క్యాడ్‌బరీ. కొడుకంటే కొడుకు కాదు, త్రిష పెంచుకునే కుక్క ముద్దు పేరు. ఇప్పుడు త్రిష దగ్గరకి ఇంకో ఫిమేల్‌ డాగీ వచ్చి చేరింది. కొడుకు పోయి, కూతురొచ్చె.. అంటూ త్రిష అమితానందాన్ని ప్రదర్శిస్తోంది. ‘మై డాటర్‌..’ అంటూ త్రిష దాన్ని ముద్దుగా పిలుచుకుంటోంది. తల్లి -కుట్రల ప్రేమ చూసి అభిమానులు తెగ ముచ్చటపడుతున్నారు.

ఇటీవల మూడు నెలలో..మూడు చిత్రాలు పూర్తి చేసిన త్రిష..ప్రస్తుతం మలయాళం లో రెండు సినిమాలు చేస్తుంది.

Exit mobile version