షూటింగ్ స్పాట్ లో మహేష్ ఎలా ఉంటాడో చెప్పిన త్రిష..

trisha-comments-maheshఇండస్ట్రీ కి వచ్చి దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న కానీ తన గ్లామర్ ను ఎక్కడ తగ్గకుండా మైంటైన్ చేస్తూ వరుస అవకాశాలను రాబట్టు కుంటున్న త్రిష ను చూసి మిగతా హీరోయిన్స్ ఈర్ష పడాల్సిందే..ఇటీవల ధనుష్ సరసన కోడి చిత్రం లో నటించి సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా తన నటన కూడా మంచి ప్రశంసలు అందుకుంది త్రిష..

ఈ ఆనందం లో త్రిష తన సినిమాల గురించి , ఆయా హీరోల గురించి చెప్పుకొచ్చింది..మహేష్ బాబు తో రెండు సినిమాలు చేసిన త్రిష , ఆ తీపి గుర్తులను అభిమానులతో పంచుకుంది. మహేష్ సరసన అతడు , సైనికుడు చిత్రాల్లో నటించగా అతడు బ్లాక్ బస్టర్ హిట్ కాగా , సైనికుడు మాత్రం డిజాస్టర్ అయ్యింది..టాక్ విషయం పక్కన పెడితే సైనికుడు షూటింగ్ టైం లో మహేష్ ఎప్పుడు కూడా లొకేషన్ లోనే ఉండేవాడట..

షాట్ రెడీ అని మళ్ళీ డైరెక్టర్ ఎప్పుడు పిలుస్తాడో అని సెట్లోనే ఉండేవాడట , ఒక్కోసారి తన పార్ట్ షూట్ అయిపోయినా కూడా మహేష్ లొకేషన్ లోనే ఉండేవాడట తనో పెద్ద హీరోని అని అస్సలు ఫోజు కొట్టేవాడు కాదట , కానీ త్రిష మాత్రం తన పార్ట్ షూట్ అయిపోగానే కార్వాన్ లోకి వెళ్లడమో లేక లొకేషన్ నుండే వెళ్లిపోవడమో చేసేదట ఇలా కొద్ది రోజులు అయ్యాక మహేష్ ని గమనించి తలదించుకుందట త్రిష..సినిమా పట్ల తనకున్న ఇంట్రస్ట్ చూసి చాల ఈర్ష పడేదాన్ని అని అతడిని చూసి చాల నేర్చుకున్నాని చెప్పుకొచ్చింది.