పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని ఎవరైనా అడిగితే అమ్మడికి విపరీతమైన కోపం వచ్చేస్తుందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. పెళ్లి ప్రశ్న వేస్తే వారి మీద చిరాకు వచ్చేస్తుంటుంది. నాకు సమాధానం కూడా చెప్పాలనిపించదు. నాకు అసలు ఆ ప్రశ్న అంటేనే చిరాకు అని చెప్పుకొచ్చింది .ఇటీవలే నిశ్చితార్ధం జరిగి పెళ్లిపీటల వరకు వచ్చిన త్రిష పెళ్లి కొన్ని అనివార్య కారణాల వలన హఠాత్తుగా మధ్యలోనే ఆగిపోయింది. అందుకే త్రిష పెళ్లి మీద ఇంత ద్వేషం పెంచుకుందని అందరూ చెప్పుకుంటున్నారు..