త్రిష కు నచ్చని ప్రశ్న.

trishaఇండస్ట్రీ కి వచ్చి 15 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా త్రిష హావ ఏ మాత్రం తగ్గడం లేదు..వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ అభిమానులను అలరిస్తుంది..సీనియర్ హీరోలతో జతకడుతూనే , లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో తన టాలెంట్ చూపిస్తూ ఇంకా అవకాశాలు రాబట్టుకుంటుంది. తాజాగా ధనుష్ సరసన ‘కోడి’ చిత్రం లో నటించి , మంచి ప్రశంసలు అందుకుంటుంది..ఈ నేపథ్యం లో ఓ ఇంటర్వ్యూ లో తనకు కోపం తెప్పించే ఓ ప్రశ్న గురించి చెప్పుకొచ్చింది.

పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని ఎవరైనా అడిగితే అమ్మడికి విపరీతమైన కోపం వచ్చేస్తుందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. పెళ్లి ప్రశ్న వేస్తే వారి మీద చిరాకు వచ్చేస్తుంటుంది. నాకు సమాధానం కూడా చెప్పాలనిపించదు. నాకు అసలు ఆ ప్రశ్న అంటేనే చిరాకు అని చెప్పుకొచ్చింది .ఇటీవలే నిశ్చితార్ధం జరిగి పెళ్లిపీటల వరకు వచ్చిన త్రిష పెళ్లి కొన్ని అనివార్య కారణాల వలన హఠాత్తుగా మధ్యలోనే ఆగిపోయింది. అందుకే త్రిష పెళ్లి మీద ఇంత ద్వేషం పెంచుకుందని అందరూ చెప్పుకుంటున్నారు..