నిజానికి చిరు స్టేట్మెంట్ తో త్రిష వెళ్లిపోవడం వెనుక ఉన్న ఊహాగానాలకు తెర పడాలి. కానీ అలా జరగలేదు. త్రిష ఈ సినిమా వదులుకోవడం వెనుక ఓ పెద్ద కారణమే ఉందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. చిత్రబృందంలో ఓ కీలకమైన సభ్యుడు త్రిషని బాగా ఇబ్బంది పెట్టారని, దాన్ని ఎదుర్కోలేక త్రిష.. ఈ సినిమాకి గుడ్ బై చెప్పిందన్న గుసగుసలు ఇండ్రస్ట్రీలో వినిపిస్తున్నాయి.