కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషని ఎంపిక చేశారు. కొంత షూటింగ్ కూడా జరిగింది. అయితే సినిమా నుండి బయటికి వచ్చేసింది త్రిష. ఈ ప్రాజెక్టు నుంచి త్రిష తప్పుకోవాల్సివచ్చిందంటూ.. చిరంజీవి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో క్లారిఫికేషన్ ఇచ్చేశారు.
నిజానికి చిరు స్టేట్మెంట్ తో త్రిష వెళ్లిపోవడం వెనుక ఉన్న ఊహాగానాలకు తెర పడాలి. కానీ అలా జరగలేదు. త్రిష ఈ సినిమా వదులుకోవడం వెనుక ఓ పెద్ద కారణమే ఉందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. చిత్రబృందంలో ఓ కీలకమైన సభ్యుడు త్రిషని బాగా ఇబ్బంది పెట్టారని, దాన్ని ఎదుర్కోలేక త్రిష.. ఈ సినిమాకి గుడ్ బై చెప్పిందన్న గుసగుసలు ఇండ్రస్ట్రీలో వినిపిస్తున్నాయి.