తాజాగా అభిమానులతో మాట్లాడిన ఈమె కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాదానాలు ఇచ్చి అందరిని సంతోష పరిచింది..తన ఫిట్నెస్ రహస్యం నియమబద్ధంగా ఆహారం తీసుకోవడమేనని, తనకు ఐస్క్రీం అంటే చాలా ఇష్టమని, ఇటీవల చూసిన చిత్రాలలో “సుల్తాన్” బాగా నచ్చిందని త్రిష చెప్పుకొచ్చింది. అలాగే తెలుగు స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ప్రభాస్ ల గురించి చెప్పి ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.
పవన్ కల్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే..పవన్ కల్యాణ్ ఆయన శైలిలో ఆయన జీవిస్తారని పేర్కొంది. స్టార్ డమ్కు పవన్ దూరంగా చాలా సింపుల్గా ఉంటారని చెప్పింది. అలాగే మహేష్ బాబు గురించి చెప్తూ..వృత్తిపై అంకితభావం కలిగిన స్వీట్ సూపర్ స్టార్ గా త్రిష అభివర్ణించింది. సినీ పరిశ్రమకు నిజమైన ‘డార్లింగ్’ ప్రభాస్ ని పేర్కొనడం కోసం మెరుపు. ప్రస్తుతం త్రిష మోహిని అనే హర్రర్ చిత్రం తో తెలుగు , తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఇటీవల రిలీజ్ అయినా ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు విశేష స్పందన లభించింది.