త్రిష జోరు తగ్గలేదు. కెరీర్ మొదలెట్టి పుష్కర కాలం దాటేసింది. అప్పట్లో త్రిష ఎలా ఉండేదో.. ఇప్పుడూ అలానే ఉంది. మూడు పదుల వయసు దాటిపోయిన త్రిష స్పీడు ఇంకా తగ్గలేదు. ఆమె చేతిలో దాదాపు ఓ నాలుగు సినిమాలు వున్నాయి. ఇందులో నిర్మల్‌కుమార్ దర్శకత్వంలో అరవిందస్వామికి జంటగా నటిస్తున్న ‘సదురంగవేట్టె 2’ఒకటి.
ఇందులో అరవిందస్వామికి భార్యగా కనిపిస్తుంది త్రిష. కథానుసారం వారికి నాలుగేళ్ల కూతురు కూడా ఉంటుందట . ఈ చిత్రంలో తల్లీకూతుళ్లపై ఓ సెంటిమెంట్ పాట కూడా ఉందట. కూతురు పాత్రలో మానస్వి అనే చిన్నారి కనిపించనుంది. ఇప్పటికే నయనతారకు కుమార్తెగా ‘ఇమైక్కా నొడిగళ్’లో ఈ చిన్నారి నటిస్తుండటం విశేషం. త్రిష ఇప్పటివరకూ చేసిన సినిమాల్లోకల్లా ఈ సినిమా డిఫరెంట్ గా ఉండబొతుందని అంటున్నారు.