Site icon TeluguMirchi.com

Trikaala First Look Poster : భయపెడుతున్న శ్రద్ధాదాస్


త్రికాల’ అనే చిత్రంలో శ్రద్ధాదాస్, అజయ్, మాస్టర్ మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా రిత్విక్ సిద్ధార్థ్ సమర్పణలో, మినర్వా పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతోంది. ద‌ర్శ‌కుడు మ‌ణి తెల్ల‌గూటి నేతృత్వంలో రాధికా శ్రీనివాస్ నిర్మాతగా, శ్రీసాయి దీప్ చాట్ల‌, వెంక‌ట్ ర‌మేష్ దాడి, ఓంకార్ ప‌వ‌న్ లు సహ నిర్మాతలుగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది.

విజువల్ గ్రాఫిక్స్‌కి పెద్ద ప్రాధాన్యం ఇచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటోంది. ఫాంటసీ మరియు హారర్ జోనర్‌లో వస్తున్న ఈ సినిమా ‘కుమారి ఖండం’ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కింది. పురాణ క‌థలకు ఆధునిక హంగులు జోడించి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో బాల నటుడు మాస్టర్ మహేంద్రన్, మొదటగా ‘దేవి’ చిత్రంలో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు, ఇప్పుడు ప్రధాన పాత్రతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Exit mobile version