‘స్లమ్ డాగ్ హస్బెండ్’ ట్రైలర్ విడుదల చేసిన హీరో కళ్యాణ్ రామ్.. నవ్వులే నవ్వులు


పిట్ట కథ సినిమాతో తెరంగేట్రం చేసిన యువ నటుడు సంజయ్ రావ్ కొత్త సినిమా “స్లమ్ డాగ్ హస్బెండ్” ట్రైలర్ ఈరోజు ప్రముఖ హీరో కళ్యాణ్ రామ్ చేతుల మీదగా విడుదల అయ్యింది. అప్పట్లో ఈ హీరో నటించిన పిట్ట కథ సినిమా వైవిద్యమైన థ్రిల్లర్ గా వచ్చి అందరిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రాబోతున్న ఈ చిత్రం కూడా వైవిధ్యమైన కామెడీ ఎంటర్టైనింగ్ కథతో రాబోతోంది అని ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.

స్లమ్ ఏరియాలో ఉండే ఒక అమ్మాయి, అబ్బాయి పెళ్లి కోసం తాపత్రయం పడే సీన్లతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత ఈ ట్రైలర్ మొత్తం చాలా డిఫరెంట్ గా కొనసాగింది. ఆ అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అంటే ఆ అబ్బాయికి ఒక గండం ఉండడంతో, తాను ఆ కారణం వల్ల మొదటిగా కుక్కని పెళ్లి చేసుకోవడం, ఇక కుక్కని పెళ్లి చేసుకున్నాక ఆ గండం గట్టెక్కింది అనే నమ్మకంతో హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు కోర్టులో మొదటి భార్య (కుక్క) బతికి ఉండగా రెండో భార్యని ఎలా చేసుకుంటారు అని కేసు పెట్టడంతో ఈ ట్రైలర్ మరింత ఆసక్తిగా మారింది. ఇక ఈ ట్రైలర్ చూశాక ప్రేక్షకులకు ఇది వింతగా అనిపించడమే కాకుండా ఎక్సైట్మెంట్ ని కూడా పెంచేయడం ఖాయం. మంచి కామెడీ తో ఈ సినిమా ప్రేక్షకులను చూసినంత సేపు నవ్విస్తూ ఉంటుంది అనే క్లారిటీ ఇచ్చేసింది. అంతేకాదు ఈ ట్రైలర్ లో బ్రహ్మాజీ, సప్తగిరి అలానే ఆలీ లాంటి వాళ్ళు మంచి కామెడీని పండించారు.

సరైన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమాకి ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించగా, మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పి రెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్‌ సిసోరియ అందిచాడు. ఇక త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నారు మేకర్స్ .