Site icon TeluguMirchi.com

Japan : హీరో కార్తి పాడిన ‘టచ్చింగ్.. టచ్చింగ్..’ సాంగ్ రిలీజ్ !


హీరో కార్తి తన 25వ చిత్రం ‘జపాన్’ తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధంగా వున్నారు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ హీస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌, ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రాగా, తాజాగా ఈ చిత్రం నుంచి ‘టచ్చింగ్ టచ్చింగ్..’ పూర్తి వీడియో సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్.

జీవీ ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన ఈ పెప్పీ అండ్ క్యాచి మ్యాసీ నెంబర్ ని ఇంద్రావతి చౌహాన్ తో కలిసి స్వయంగా కార్తి ఆలపించారు. కార్తి వాయిస్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే భాస్కరభట్ల అందించిన లిరిక్స్ మాస్ అప్పీలింగ్ గా వున్నాయి. ఈ పాటలో కార్తి, అను ఇమ్మాన్యుయేల్ కెమిస్ట్రీ ఫ్యాషనేటింగ్ అండ్ కలర్ ఫుల్ గా వుంది. అంతేకాదు వారి డ్యాన్స్ మూమెంట్స్ మెస్మరైజ్ చేశాయి. అలాగే గ్రాండ్ సెట్స్, విజువల్స్ చాలా ఎట్రాక్టివ్ గా వున్నాయి. ముఖ్యంగా కార్తి జపాన్ గెటప్, మ్యానరిజం ఎక్స్ ట్రార్డినరీ గా వుంది.

Touching Touching - Video Song | Japan (Telugu) | Karthi, Anu Emmanuel | GV Prakash | Raju Murugan

ఇకపోతే ఈ చిత్రంలో కేఎస్ రవికుమార్, సునీల్, విజయ్ మిల్టన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ‘జపాన్’ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు రాష్ట్రాల్లో దీపావళి కానుకగా నవంబర్ 10న ఘనంగా విడుదల చేస్తోంది.

Exit mobile version