పాటంతా గ్రాఫిక్స్‌ లోనే!

ne-mayaloneవిజువ‌ల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యం రోజు రోజుకీ ఎక్కువ‌వుతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేదు. ప్రతి సినిమాలోనూ ఏదో ఓ రూపంలో ఈ ఎఫెక్ట్స్ క‌నువిందు చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఓ పాట మొత్తం గ్రాఫిక్స్‌లోనే తీసేశారు. న‌వ‌దీప్ సినిమా కోసం. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం అంతా ‘నీ మాయ‌లోనే’. స్నేహా ఉల్లాల్ క‌థానాయిక. పి.వి.కృష్ణ ద‌ర్శకుడు. ఈ చిత్రంలోని ఓ గీతాన్ని గ్రాఫిక్స్‌ లో తీశారు. ద‌ర్శకుడు మాట్లాడుతూ… ఇంత వ‌ర‌కూ రాని రొమాంటిక్ ఫ్లేవ‌ర్ ఈ సిమాలోఉంటుంది. గ్రాఫిక్స్‌ లో తీసిన పాట ప్రేక్షకుల‌ను ఓ కొత్తలోకంలోకి తీసుకెళ్తుంద‌న్నారు. ఈనెల 11 వ‌ర‌కూ హైద‌రాబాద్‌ లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. జూన్ 1 నుంచి రెండో షెడ్యూలు మొద‌లుపెడ‌తారు.