టాలీవుడ్ సెంటిమెంట్స్..

Tollywood-Sentimentటాలీవుడ్ జనాలకు సెంటిమెంట్స్ ఎక్కువ..సినిమా ఓపెనింగ్ నుండి రిలీజ్ వరకు కూడా సెంటిమెంట్స్ నమ్ముతారు..అందులో భాగంగా ఒక్కక్కరు ఒక్కో సెంటిమెంట్ ఫాలో అవుతారు. మరి టాలీవుడ్ ప్రముఖులో ఎవరు ఏయే సెంటిమెంట్ ఫాలో అవుతారు ఇప్పుడు మనం చూద్దాం…

స్క్రీన్ మీద తమ హీరోయిజాన్ని చూపించే హీరోలు..నిజ జీవితపు హీరోలు అయిన దేవులనే నమ్ముతారు. తాజాగా ఆగడు రిలీజ్ టైం ప్రిన్స్ మహేష్ బాబు అజ్మీర్ షరాఫ్ దర్గని దర్శించుకున్నాడు. తన ప్రతి సినిమా కు అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతాడు. ఇక ఆ సినిమా దర్శకుడు శ్రీను వైట్ల తన సినిమా విడుదలకు ముందు సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడం అలవాటు.

అలాగే బండ్ల గణేష్ తను తీసే ప్రతి సినిమా ఆడియో సిడిలని వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టడం అలవాటు. ఇక మరో నిర్మాత బెల్లం కొండ సురేష్ తన ప్రతి సినిమా కు ముందు జూబ్లి హిల్స్ లోని పెద్దమ్మ గుడి కి వెళ్ళడం అలవాటు. అలాగే దర్శకుడు రాఘవేంద్ర రావు తన సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గరి నుండి సినిమా పూర్తీ అయ్యేంత వరకు కూడా గడ్డం తియాడు..అలాగే రాజమౌళి కూడా సెం.. అలాగే యంగ్ హీరో అల్లు అర్జున్ కూడా తన సినిమాలోని ఓ షాట్ అయిన వైజాగ్ లో షూట్ చేసి విధంగా ప్లాన్ చేసుకుంటాడు..బాలకృష్ణ కూడా విజయనగరం లో ఓ షాట్ అయిన షూటింగ్ జరుపుకుంటాడు. మెగా స్టార్ చిరు తన సినిమా లో ఓ సారి అయిన తెల్ల డ్రెస్ కనపడేలా చూసుకుంటాడు.

ఇలా సినీ ప్రముఖుల సెంటిమెంట్స్ ఇన్ని అన్ని కాదు..సెంటిమెంట్ మాట పక్కనపెడితే కృషి లో మాత్రం ఎలాంటి లోపం ఉండకోడదు అంటారు.