Site icon TeluguMirchi.com

వందకోట్ల వైపు టాలీవుడ్ సినిమా

moviesకొంత కాలంగా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు కలెక్షన్లు నమోదవుతున్నాయి. తెలుగు సినిమా బడ్జెట్ పెరుగుతుండడంతో పాటు కలెక్షన్లు కూడా అదే రేంజ్ లో రాబడుతున్నారు అగ్రహీరోలు. ప్రస్తుతం టాలీవుడులో చిన్న హీరో సినిమా బాగుందంటే చాలు 20 కోట్లు మార్క్ ను దాటుతుండడం కామన్ గా మారింది.

కనీసం పేరు లేని చిన్న హీరోల సినిమాలకు హిట్టు టాక్ వస్తే చాలు రికార్డు కలెక్షన్లను క్రియేట్ చేస్తున్నాయి.అలాంటిది ఓ క్రేజీ స్టార్ సినిమాకు హిట్టు టాక్ వచ్చిందంటే ఇక నిర్మాతకు కలెక్షన్ల పండగే అని చెప్పాలి. టాలీవుడులో ప్రస్తుతం 50కోట్లు అనేది టార్గెట్ గా మారింది. కానీ ఇప్పుడ అది కూడా చేరిగిపోయి వందకోట్లు గా మారే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెప్పుతున్నాయి.

అత్తారింటికి దారేది సినిమా కలెక్షన్లతో మరోసారి టాలీవుడు కలెక్షన్లపై ఆసక్తి ఏర్పడింది.ఈ సినిమా సాధించిన విజయంతో తెలుగు సినిమా త్వరలో వందకోట్లు దాటడంలో ఆశ్చర్యం లేదని పరిశీలకులు చెప్పుతున్నారు. ఇలా టాలీవుడులో అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన టాప్ టెన్ సినిమాల కలెక్షన్లపై ఓ స్పెషల్ లుక్..

తెలుగు సినిమా రంగానికి దొరికిన అరుదైన కమర్షియల్ డెరెక్టర్ రాజమౌళి.ఆయన తీసిన ప్రతి సినిమా రికార్డులు సృష్టించింది.జక్కన్న చిన్న హీరోతో చేసిన ఈగ ను పెట్టి సినిమా తీసిన సరే కలెక్షన్లలో మాత్రం కొత్త రికార్డులు తిరగరాస్తాడు. చిన్న హీరోగా చిన్న సినిమాలు చేస్తున్న నాని ని హీరోగా పెట్టి సిని జక్కన్న రాజమౌళి ‘ఈగ’ అనే సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమాలో నాని మొదటి పది నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు.ఈ తరువాత సినిమా మొత్తం ఈగ చుట్టు తిరుగుతుంది. అయిన ఈ సినిమా ను రాజమౌళి అద్బతంగా తీయడంతో సూపర్ హిట్టు కొట్టి 43కోట్లు సాధించమే కాకుండా టాలీవుడు టాప్ 10 కలెక్షన్లలో పదవ స్థానంలో నిలిచింది.

మెగాస్టార్ వారసుడిగా సిని ప్రేవేశం చేసిన రామ్ చరణ్ పక్కా కమర్షియల్ హీరోగా పేరు సంపాదించు కుంటున్నాడు. కలెక్షన్లను కొల్లగొట్టే కమర్షియల్ కథలతో రికార్డులు బద్దలు కొడుతున్నాడు.సంపత్ నంది దర్శకత్వం లో చెర్రి హీరోగా వచ్చిన రచ్చ మూవీ యావరేజి గా ఉన్నా కూడా కలెక్షన్లను మాత్రం రికార్డు స్థాయిలో రాబట్టింది. రచ్చ సినిమా సుమారు 44.2కోట్లు ను రాబట్టి టాప్ టెన్ కలెక్షన్లలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

మాస్ డెరెక్టర్ గా ముద్ర పడ్డ వినాయక్ డెరెక్షన్ లో చరణ్ హీరోగా సంక్రాంతి రీజైంది నాయక్ సినిమాఈ సినిమా కూడా మూస పద్దతిలో ఉన్నప్పటికి కలెక్షన్లు భారీగా కొల్లగొట్టింది. సుమారు 46 కోట్లను రాబట్టిన ఈ నాయక్ సినిమా టాప్ టెన్ లో 8వ స్థానం దక్కించుకుంది.

ఇంతవరకు 50కోట్ల మార్క్ ను దాటని ఎన్టీఆర్ కు ఆ దిశగా నమ్మకాన్ని కలిగించిన సినిమా బాద్ షా.శ్రీనువైట్ల డెరెక్షన్ లో ఈ ఉగాదికి వచ్చిన బాద్ షా బాక్సఫీసు వద్ద భారీగానే సొమ్ము చేసుకుంది.ఎన్టీఆర్ స్టార్ డమ్ తో పాటు శ్రీనువైట్ల టేకింగ్ తో ఈ సినిమా 47కోట్ల మార్కును అందుకుని ఎన్టీఆర్ కు ఊరట కలిగించడమే కాకుండా తనకు తొలి 40కోట్ల సినిమా గా తీపిగుర్తుగా మిగిలింది. బాద్ షా టాప్ గ్రాస్ సినిమాల లిస్టులో 7ప్లేస్ ను దక్కించుకుంది.

యూత్ లో,మాస్ లో మంచి క్రేజ్ ఉన్న కూడా సరైన హిట్టు లేకపోవడంతో టాప్ గ్రాస్ లో వెనకపడ్డాడు ప్రభాస్. ఈ ఎడాది వచ్చిన మిర్చితో ప్రభాస్ భారీ హిట్టు కొట్టి టాప్ గ్రాస్ సినిమా లిస్టులో స్థానం సంపాందించాడు. ప్రభాస్ తో ఎలాంటి సినిమా తీస్తే రికార్డు కలెక్షన్లు వస్తాయో అలాంటి సినిమా నే రూపొందించాడు దర్శకుడు కొరటాల శివ. ప్రభాస్ స్టైలిష్ పర్ ఫర్ఫమెన్స్ ,దర్శకుడి మాస్ టచ్ తో పాటు దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు ఈ సినిమా ను భారీ హిట్టు దిశగా పరుగులు తీయించాయి.మిర్చి 48 కోట్లను రాబట్టి టాప్ టెన్ లో 6 స్థానం లో నిలిచింది.

తెలుగులో తొలి బిగ్ మల్టీస్టారర్ సినిమా గా రూపొందించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు సినిమా భారీ వసూళ్లను రాబట్టింది.ఈ ఎడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా క్లీన్ సినిమా పేరు తెచ్చుకుంది. విక్టరీ వెంకటేష్,పిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో శ్రీకాంత్ అడ్డాల డెరెక్షన్ లో వచ్చింది సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు.ఇద్దరూ స్టార్ హీరోలు ఉండడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.అయితే అటు ప్రిన్స్ ఇటు వెంకీ మార్క్ లేకపోవడం ఈ సినిమాకు ప్రధాన మైనస్.కానీ ఈ సినిమా బాక్సఫీసు వద్ద 51కోట్ల గ్రాస్ ను సాధించి టాప్ టెన్ లో 5వ స్థానం పొందింది.ఈ సినిమా కనుక కాస్త కమర్షియల్ గా ఉండి ఉంటే ఇంకా ఎక్కువగా కలెక్ట్ చేసింది.

ప్రిన్స్ మహేష్ బాబుకు పోకిరి తరువాత అంతటి సక్సెస్ కోసం చాలా రోజులు వెయిట్ చేసాడు.సూపర్ హిట్టు కోసం ప్రిన్స్ ఎదురుచూస్తున్న టైంలో వచ్చిన దూకుడు బాక్సపీసు వద్ద కలెక్షన్లలో దూకుడు చూపించిదనే చెప్పాలి.పోకిరితో తొలిసారి 40క్రోర్స్ క్లబ్ లో చేరిన ప్రిన్స్ దూకుడు తో మరోసారి అది రిపీట్ చేసాడు.ప్లాప్ లతో సతమతమవుతున్న ప్రిన్స్ కి దూకుడు సూపర్ హిట్టు ని అందించింది.శ్రీనువైట్ల డెరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో శ్రీనువైట్ల డెరెక్షన్.. మహేష్ యాక్టింగ్.. బ్రహ్మనందం కామెడి.. బాగా పండడంతో భారీ హిట్టు కొట్టింది. కామెడితో పాటు తండ్రి సెంటిమెంట్ తో వచ్చిన దూకుడు 56కోట్ల మార్క్ ను అందుకుని టాప్ టెన్ లో 4స్థానంలో నిలిచింది.

పదేళ్లుగా సూపర్ హిట్టు లేని పవర్ స్టార్ స్టామినాను తెలిపిన సినిమా గబ్బర్ సింగ్. అంతవరకు సరైన హిట్టు లేకున్నా కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ తోనే గబ్బర్ సింగ్ బంఫర్ హిట్టు కొట్టింది.అంతేకాదు ఈ సినిమా కొత్త రికార్డులను నెలకొల్పింది.

పవన్ స్టార్ డమ్ ను సరిగా వాడుకుంటే కలెక్షన్లను భారీ కొల్లగొట్టవచ్చు అని నిరూపించిన సినిమా గబ్బర్ సింగ్. కేవలం పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ యాక్టింగ్ క్రేజ్ తో సినిమా సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. ఓ మాములు క్యారెక్టర్ ని తనదైన స్టైల్ లో ఓ రేంజ్ లో పండించి తన ఇమేజ్ పవర్ తో సూపర్ హిట్టుగా నిలిపాడు పవన్ కళ్యాణ్. గబ్బర్ సింగ్ 60కోట్ల గ్రాస్ తో టాప్ టెన్ లో మూడో స్థానంలో నిలిచింది.

ఇక అంతవరకు తెలుగు సినిమా కనీవిని ఎరుగని రీతిలో కలెక్షన్లను రాబట్టిన సినిమా మగధీర అనే చెప్పాలి.తెలుగు సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్లను కొల్లగొడుతుంద అని సిని పరిశీలకులు ఆశ్చర్యపోయేలా ఈ సినిమా కలెక్షన్లు సాధించింది.

సూపర్ గా తీస్తే తెలుగు సినిమా 50కోట్లు సాధించగలదు అని మొదటి సారిగా నిరూపించిన సినిమా మగధీర. హైబడ్జెట్ తో అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమా యావత్తు దేశవ్యాప్తంగా అన్ని సినిమా రంగాలను ఆకర్షించింది.రాజమౌళి అద్భుత టేకింగ్,చరణ్ అద్బుతమైన నటన తో ఈ సినిమా తెలుగులో అద్భుతమైన సినిమా ప్రత్యేక స్థానం సంపాందించుకుంది. మొన్నటి వరకు టాప్ వన్ లో ఉన్న ఈ సినిమా 73కోట్లను కలెక్ట్ చేసి టాప్ టెన్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది.

పవర్ స్టార్ రేంజ్ ను ఆయన స్టామినాను మరోసారి తెలిసేలా చేసిన సినిమా అత్తారింటికి దారేది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఆల్ రికార్డ్స్ ను ఒక్కొక్కటిగా చేరిపివేస్తే దూసుకుపోతున్నాడు. అది కూడా విడుదలకు ముందే పైరసీ అయిన కూడా ఏ మాత్రం ఈ సినిమా పై ప్రభావం పడకపోవడం పవర్ స్టాన్ స్టామినాకు ప్రతీక అని చెప్పాలి.

త్రివిక్రమ్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ మూవీగా ఏ మాత్రం అసభ్యతకు చోటు లేకుండా తీసిన సినిమా అత్తారింటికి దారేది.సినిమా విడుదల ముందే పైరసీకి గురైంది.ఇక సినిమా ఫలితం ఎలా ఉంటుందో అనుకున్నారంతా కానీ పవన్ క్రేజ్ ముందు అవన్ని తేలిపోయాయి.త్రివిక్రమ్ క్లీన్ టేకింగ్ పాటు పవర్ స్టార్ తన యాక్టింగ్ తో మరోసారి మెస్మరైజ్ చేశాడు.ఫలితం మగధీర రికార్డ్స్ చేరిగిపోయాయి.

అత్తారింటికి దారేది రిలీజైన 25రోజులో సుమారు 73కోట్లు దాటి ఇంకా విజయవంతంగా స్టడీ కలెక్షన్లతో పరుగులు తీస్తుంది.సీమాంధ్రలో కనుక సరిగా ప్రదర్శించి ఉంటే ఈ పాటి అత్తారింటికి 100కోట్ల మార్క్ ను అందుకునేది. ఇప్పటికి కూడా కలెక్షన్లు స్టీడిగా ఉండడంతో పరిశీలకులు కచ్చితంగా ఈ సినిమా తెలుగులో తొలి వంద కోట్ల సినిమా అందుతుందని చెప్పుతున్నారు. మరి అత్తారింటికి మరేన్ని కలెక్షన్లు కొల్లగొడుతుందో చూడాలి.

టాప్ టెన్ కలెక్షన్లలో మెగా హీరోలు ఇద్దరుండడం విశేషం కాగా అందు లో మొదటి రెండూ సినిమా వారివే కావడం…పస్ట్ పేస్ల్ లో మూడో పేస్ల్ లో పవర్ స్టార్ సినిమాలు ఉన్నాయి. అలాగే రామ్ చరణ్ సినిమా రెండో ప్లేస్ తో పాటు ఆయన సినిమాలు మూడు టాప్ టెన్ స్థానం సంపాదించడం విశేషం.

మరి రానున్న భారీ సినిమా ఎవడు,వన్,బహుబలి లాంటి సినిమా ఎలాంటి రికార్డు కలెక్షన్లు సాధిస్తాయో ఏ హీరో తొలి వంద కోట్ల హీరోగా తెలుగులో టాలీవుడులో చరిత్ర సృష్టిస్తాడో వెయిట్ అండ్ సీ…

Exit mobile version