Site icon TeluguMirchi.com

సినిమా పరిశ్రమకి మరో ఆప్షన్ లేదు

ఈనెల 14న లాక్ డౌన్ ఎత్తేసినా అన్ని పరిశ్రమలు ఎప్పటిలానే మొదలైయ్యే అవకాశం ఐతే కనిపించడం లేదు. ఇందులో సినిమా పరిశ్రమ కూడా వుంది. లాక్ డౌన్ ఎత్తేసి, థియేట‌ర్ల‌కు పర్మిష‌న్లు ఇచ్చినా స‌రే, మ‌రో మూడువారాల పాటు సినిమాల్ని విడుద‌ల కుదరదు. లాక్ డౌన్ ఎత్తేసినా, ప‌రిస్థితులు స‌ద్దుమ‌ణ‌గ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంది.

దానికి తోడు థియేట‌ర్ల‌కు, షాపింగ్ మాల్స్‌కీ అనుమ‌తులు ఇవ్వ‌క‌పోవొచ్చు. ఎంత లేట్ అయినా… మే తొలి వారం నుంచి కొత్త సినిమాలు వ‌స్తాయ‌ని భావించ‌డంలో త‌ప్పులేదు. కానీ చిత్ర‌సీమ మాత్రం అందుకు సిద్ధంగా లేద‌ని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ప్రేక్షకులు థియేటర్ కి రావడానికి సిద్ధంగా లేరు. వారిలో ఇంకా కరోనా భయం ఉంటుంది. ఇలాంటి నేపధ్యంలో మరి కొంత కాలం సినిమా పరిశ్రమ వెనక్కి వెళ్లిపోవడం ఐతే ఖాయం.

Exit mobile version