మంచు మనోజ్ టాలీవుడ్ లో నటుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇటీవల మంచు మనోజ్ తన పర్సనల్ లైఫ్ తో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. 2015లో ప్రణతిని ప్రేమించి పెళ్లిచేసుకున్న మనోజ్ మనస్పర్థల కారణంగా 2019లో విడాకులు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం మనోజ్ రెండో వివాహానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ దివంగత నేత భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికరెడ్డిని పెళ్లాడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వీరు పెళ్లిపీటలెక్కనున్నట్లు సమాచారం. వివాహ తేదీ ఖరారు అయినట్లు తెలిసింది. మార్చి 3న మౌనికరెడ్డి మెడలో మంచు మనోజ్ మూడు ముళ్లు వేయబోతున్నట్లు చెబుతున్నారు.
ఇకపోతే మంచు మనోజ్ సోదరి మంచు లక్ష్మి పెళ్లి ఏర్పాట్లని దగ్గరుండి చూసుకుంటున్నారట. మంచు మనోజ్ కి, భూమా మౌనికకి చాలా కాలం క్రితమే పరిచయం ఉంది. గతంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా కూడా వీరిద్దరూ జంటగా కనిపించారు. అప్పటి నుంచి వీరిద్దరి రిలేషన్ అఫీషియల్ గా వైరల్ అవుతోంది. అయితే మంచు మనోజ్‌తో పాటు మౌనికకు కూడా ఇది రెండో వివాహం. అయితే దీనిపై ఇటు మంచు ఫ్యామిలీ, అటు భూమా ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోన్న మంచు మనోజ్ ఇటీవలే రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. వాట్ ది ఫిష్ పేరుతో ఓ సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశాడు.