Site icon TeluguMirchi.com

గొల్ల‌భామ కాద‌ట‌

varun
మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ క‌థానాయకుడిగా ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌కుడు. పూజా హెగ్డే క‌థానాయిక‌. ఈ చిత్రానికి గొల్ల‌భామ అనే పేరు ప్ర‌చారంలో ఉంది. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా టైటిల్ అదే అని ఫిక్స‌యిపోయారు కూడా. అయితే ఈ సినిమా టైటిల్ గొల్ల‌భామ కాద‌ట‌. త్వ‌ర‌లోనే టైటిల్ మారుస్తార‌ని, ఈ సినిమా కోసం ఓ ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ ఎంపిక చేశార‌ని తెలుస్తోంది. గొల్ల‌భామ టైటిల్ మ‌రీ సాఫ్ట్‌గా ఉంద‌ని, ఇలాంటి టైటిళ్లు మాస్‌కి న‌చ్చ‌వ‌ని చిత్ర‌బృందం అభిప్రాయ ప‌డుతోంది. ఈ టైటిల్ మార్చే విష‌యంలో నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ స‌సేమీరా అన్న ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ అడ్డాల ఇప్పుడు వారి ఒత్తిడికి లొంగిపోయాడ‌ని టాక్‌. ఈ టైటిల్ మార్చ‌డం ఇష్టం లేక‌పోయినా, త‌లొగ్గాడ‌ని… త్వ‌ర‌లోనే మాస్‌కి ఎక్కే ఓ పేరు ఫైన‌ల్ చేస్తార‌ని స‌మాచార‌మ్‌.

Exit mobile version