లాక్‌డౌన్ ముగిసాక కూడా ప్రజలు అంత సులువుగా థియేటర్‌కు రాలేరని, ఒక ఏడాది పాటు గడ్డుకాలం వుంటుందని అభిప్రాయపడింది బాలీవుడ్ హీరోయిన్ టీస్కో చోప్రా. కరోనా వైరస్ వల్ల విధించిన లాక్‌డౌన్ సెల్‌ఫోన్‌కు మరింత అతుక్కుపోయేలా చేసింది. ఇంట్లో బోర్ కొట్టకుండా ఉండేందుకు సీరియళ్లు, కాదంటే వెబ్ సిరీస్, ముఖ్యంగా సినిమాలు.. ఇలా అన్నింటినీ కూర్చున్నదగ్గరే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో థియేటర్ ని మర్చిపోయే పరిస్థితి.
దీంతో ” రానున్న కాలంలో చిన్న, మధ్య తరహా సినిమాలు కూడా వెబ్ ని ఎంచుకుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ బయట కలిసి తిరగడానికి భయపడతారని, దీనివల్ల థియేటర్లకు గడ్డు పరిస్థితులు ఎదురు కానున్నాయని ఆమె చెప్పుకొచ్చింది.