Tillu Square : ‘టిల్లు స్క్వేర్’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే ?


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇక ఈ సినిమాలో టిల్లు వంటి గొప్ప వినోదాత్మక పాత్రతో సిద్ధు స్టార్ అయిపోయాడు. అంతేకాదు ఈ సినిమాకు సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్‌’ రాబోతుంది. ఈసినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే హడావిడి చేయకుండా, ఒరిజినల్ కి ఏమాత్రం తగ్గకుండా పూర్తి వినోదాత్మకంగా మలచడానికి తమ సమయాన్ని వెచ్చిస్తున్నారు మేకర్స్.

మొత్తానికి ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అఫిసియల్ గా ప్రకటించారు మేకర్స్. ఇక టిల్ స్క్వేర్‌లో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు. డీజే టిల్లులో నేహా శెట్టి పోషించిన రాధిక పాత్ర తరహాలో ఈ పాత్ర కూడా గుర్తుండిపోయేలా ఉంటుందని మేకర్స్ హామీ ఇచ్చారు. ఇప్పటికే రామ్ మిరియాల స్వరపరిచి, పాడిన టికెటే కొనకుండా అనే పాటను మేకర్స్ విడుదల చేయగా భారీ హిట్ అయ్యింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.