Site icon TeluguMirchi.com

Tillu Square : ‘టిల్లు స్క్వేర్’ స్పెషల్ బర్త్‌డే గ్లింప్స్.. రాధిక జ్ఞాపకాల్లో టిల్లు !


స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ అనతికాలంలోనే ప్రేక్షకులకు ఇష్టమైన నటుడిగా మారిపోయారు. ముఖ్యంగా ఆయన నటించిన ‘డీజే టిల్లు’ చిత్రం కల్ట్ స్టేటస్ సాధించింది. ఐకానిక్ క్యారెక్టర్ ‘టిల్లు’తో ప్రేక్షకులను మరోసారి అలరించాలని నిర్ణయించుకున్న సిద్ధు జొన్నలగడ్డ.. ‘డీజే టిల్లు’ చిత్రానికి కొనసాగింపుగా ‘టిల్లు స్క్వేర్’ చేస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన “టికెట్టే కొనకుండా”, “రాధిక” పాటలు విశేషంగా ఆకట్టుకొని, చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి.

ఇకపోతే ఈరోజు (ఫిబ్రవరి 7న) సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా, చిత్ర బృందం ఈ సినిమా నుండి స్పెషల్ బర్త్‌డే గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇక ఈ గ్లింప్స్‌ మునుపటి చిత్రం ‘డీజే టిల్లు’లో జరిగిన విషయాలను గుర్తు చేయడమే కాకుండా, ‘టిల్లు స్క్వేర్’ ఎలా ఉండబోతుందనే ఆసక్తిని కూడా కలిగిస్తోంది. టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో మరోసారి డైలాగులతో మ్యాజిక్ చేశాడు. అనుపమ పరమేశ్వరన్ గతంలో కంటే చాలా అందంగా, మరింత గ్లామరస్‌గా కనిపిస్తుంది. అంతేకాదు ఈ సినిమా ట్రైలర్ ను ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ చిత్రానికి రామ్ మిరియాల, అచ్చు రాజమణి సంగీతం అందిస్తుండగా.. థమన్ నేపథ్య సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం 2024, మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

Tillu Square - Siddu Birthday Glimpse | Anupama Parameswaran | Trailer From 14th Feb

Exit mobile version