Site icon TeluguMirchi.com

Tiger Nageswara Rao : ‘టైగర్ నాగేశ్వరరావు’ ట్రైలర్ వచ్చేసింది.. చూశారా ?


మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’ అక్టోబర్ 20న గ్రాండ్‌ గా విడుదల కానుంది. గ్రిప్పింగ్ టీజర్, చార్ట్‌బస్టర్ పాటలతో టైగర్ నేషనల్ వైడ్ గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో జోరు పెంచింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని ముంబై లోని ఫన్ రిపబ్లిక్ మాల్ లో కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసారు.

Tiger Nageswara Rao Trailer - Telugu | Ravi Teja | Vamsee | Abhishek Agarwal

ఇక ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా, యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. ఇందులో రవితేజ మరోసారి తన మాస్ లుక్, డైలాగులతో అలరించారు. ఇకపోతే ఒకప్పటి స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా రేణు దేశాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version