Site icon TeluguMirchi.com

‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఫిక్స్..


మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ యేడాది విడుదల కాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటి. కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వంటి రెండు బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌బస్టర్‌లను అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ నిర్మాత అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది.

తాజాగా మేకర్స్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల తేదీని అనౌన్స్ చేశారు. టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ లుక్ మే 24న విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమా 1970ల నేపథ్యంలో స్టూవర్టుపురంలోని గజదొంగ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. ఈ పవర్ ఫుల్ పాత్ర పోషించేందుకు రవితేజ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా సరికొత్త బాడీ లాంగ్వేజ్‌, యాసతో ఆకట్టుకుంటారు. ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 20 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అవుతుంది.

Exit mobile version