Site icon TeluguMirchi.com

Tillu Square : ‘టికెట్ కొనకుండా’ నే లాటరీ కొట్టేసిన టిల్లన్నా..


సిద్దు జొన్నలగడ్డ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా ‘డీజే టిల్లు’ సినిమాకి సీక్వెల్ గా రానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసారు మేకర్స్.

‘టికెట్ ఏ కొనకుండా..’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసారు. ఈ పాటకి కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాయగా, రామ్ మిరియాల పాడటం మాత్రమే కాకుండా, కంపోజ్ కూడా చేశారు. ఇకపోతే ఈ పాట కూడా ‘టిల్లు అన్న డీజే పెడితే..’ పాట లాగానే అందరిని ఒక ఊపు ఊపేయడం ఖాయం. ఈ సాంగ్ లో సిద్దు, అనుపమల మధ్య రొమాన్స్ చూస్తుంటే సినిమా ఒక రేంజ్ లో ఉండబోతుందని అర్ధం అవుతుంది. జానీ మాస్టర్ కోరియోగ్రఫీ అందించిన ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు టిల్లన్న ఈసారి టికెట్ కొనకుండానే లాటరీ కొట్టేసాడు అంటున్నారు అభిమానులు. ఇకపోతే సెప్టెంబర్ 15న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ డీజే టిల్లు లాగానే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి మరి.

Exit mobile version