‘జ్ఞాపకాలు.. చెడ్డవైనా, మంచివైనా ఎప్పుడూ మనతోనే ఉంటాయి. మోయక తప్పదు’అంటున్నాడు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తొలిప్రేమ’. రాశీ ఖన్నా కథానాయిక. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
‘కలగా నా జీవితంలోకి వచ్చావ్. కలగంటున్నప్పుడు వెళ్లిపోయావ్.. మళ్లీ ఇలా మెరిశావ్. కలో నిజమో అర్థం కావడంలేదు’ అని వరుణ్ తేజ్ చెబుతున్న ఓడైలాగ్ ఫీల్ గుడ్ గా వుంది.
ట్రైన్లో రాశీఖన్నాను చూసిన వరుణ్‌తేజ్..వెంటనే రైలెక్కి ఆమెను వాటేసుకోవడం..‘ఇంత అందంగా ఉన్నావేంటి’ అని అని నటే రాశీ వరుణ్ చెంప ఛెళ్లుమనిపించే సీన్ బావుంది. ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.