వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రం తొలిప్రేమ. వెంకీ అట్లూరి దర్శకుడు. రాశీఖన్నా కథానాయిక. ఈనెల 10న విడుదల అవుతోంది. ఇప్పుడు ట్రైలర్ వదిలారు. పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రమిది. ‘కలగా నా జీవితంలోకి వచ్చావ్. కలగంటున్నప్పుడు వెళ్లిపోయావ్.. మళ్లీ ఇలా మెరిశావ్. కలో నిజమో అర్థం కావడంలేదు’ అని వరుణ్ తేజ్ చెబుతున్న ఓడైలాగ్ వింటే లవ్, ఫీల్ గుడ్ ఎమోషన్స్‌తో సాగే కథని అర్ధమౌతుంది
. ‘జ్ఞాపకాల’ చుట్టూ నడిచే ఇద్దరు ప్రేమికుల జీవితం. దాన్ని ట్రైలర్లో కనిపించేలా చేశారు. విజువల్స్ , ఆర్.ఆర్… ఎమోషన్స్ ఇవన్నీ చూస్తుంటే మరో మంచి ప్రేమ కథా చిత్రమ్ చూడబోతున్నామన్న సంగతి అర్ధమౌతుంది. ట్రైలర్ చివర్లో హారన్ సౌండ్‌కి ఉలిక్కి పడడం.. ముద్దు మిస్ అవ్వడం.. ఫన్నీగా వుంది.
పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ ఎంత పెద్ద విజయం సాదించిందో అందరికీ తెలిసిందే. అయితే అదే టైటిల్ వస్తున్న ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా వ్యతాసం వుందని అర్ధం అవుతుంది. కేవలం ఆ టైటిల్ నే తీసుకొని ఓ ఫీల్ గుడ్ లవ్ స్టొరీ చేశారు. మరి టైటిల్ మ్యాజిక్ ఎలా వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.