టికెట్లు తెగుతాయా?

this weekend movieఈ వారం బాక్సాఫీసు ద‌గ్గర సంద‌డి కాస్త ఎక్కవగానే ఉన్నట్టు క‌నిపిస్తోంది. పెద్ద సినిమాలేమీ లేక‌పోయినా, చిన్నసినిమాలు క్యూ క‌ట్టడంతో ఆ లోటు కనిపించ‌క‌పోవ‌చ్చు. గురువారం ఎలాగూ సెల‌వుదినం. శుక్ర, శ‌ని, ఆది… ఈ మూడూ సినిమాల‌కు కీల‌కం. కాబ‌ట్టి నాలుగు రోజులు దొరికేసిన‌ట్టే. అయితే.. ఆశించిన స్థాయిలో టికెట్లు తెగుతాయా? అనేదే ప్రశ్నగా మారింది. సుశాంత్ (అడ్డా)కి క్రేజ్ లేదు. కానీ.. ప‌బ్లిసిటీ హై లెవిల్లో చేస్తున్నారు. జ‌గ‌ద్గురు ఆదిశంక‌ర సినిమాదీ అదే ప‌రిస్థితి. నాగార్జున‌, మోహ‌న్‌బాబులాంటి ఉద్దండులు ఉన్నమాటే గానీ – వారి పేరు సినిమాకు ఎంత వ‌ర‌కూ ఉప‌యోగ‌ప‌డుతుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. తేజ సినిమా 1000 అబ్దద్దాలు కూడా హ‌డావుడిగానే ఉంది. కానీ ఆయ‌న‌కా విజ‌యాలు లేవు. తేజ సినిమా వ‌చ్చింద‌ని గుడ్డిగా జనం థియేట‌ర్లకు వెళ్లిపోయే రోజులు కావు. ద‌ళం సినిమా గురించి జ‌నాల‌కు చేరిందా అనేది డౌటే! ఇన్ని అప‌న‌మ్మకాల మ‌ధ్య ఈవారం అయిదారు సినిమాలు విడుద‌ల కానున్నాయి. మ‌రోవైపు సీమాంధ్రలో సినిమాలు చూసే ప‌రిస్థితి లేదు. మార్నింగ్ షో, మాట్నీలు ఆడ‌డం లేదు. సినిమా మ‌రీ బాగుంటే త‌ప్ప జ‌నాలు థియేట‌ర్లకు వెళ్లరు. మరి ఈ చిన్న సినిమాల‌కు టికెట్లు తెగ‌తాయా? ఈ ఇక్కట్లు త‌ప్పించుకొంటాయా?? చూద్దాం.