మొత్తానికి బాలయ్య లుక్ గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్లో చర్చ జరిగింది. ఇదే సమయంలో సినిమా గురించిన వార్తలు కూడా వచ్చాయి.
లీక్ అయిన ఫొటోకు విపరీతమైన స్పందన రావడంతో చిత్ర యూనిట్ సభ్యులు తాజాగా అధికారికంగా లుక్‌ను రివీల్ చేశారు. ఇంకా టైటిల్‌ను ఖరారు చేయకున్నా కూడా సినిమాలో బాలయ్య లుక్‌పై క్లారిటీ ఇచ్చారు. బాలయ్య లుక్ అలాగే ఉంటుందని, అదేదో స్టిల్ కాదని దర్శకుడు కేఎస్ రవికుమార్ చెప్పకనే చెప్పాడు. బాలయ్య కెరీర్లో 105వ చిత్రం అయిన ఈ చిత్రంకు ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. త్వరలోనే టైటిల్‌ను ఖరారు చేసి మరో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తారేమో చూడాలి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.