Site icon TeluguMirchi.com

నితిన్‌ ని తొక్కేయ‌డానికి ట్రై చేశార‌ట‌

nithin-in-heart-attack‘హార్ట్ ఎటాక్‌’కి మంచి స్పంద‌న వ‌స్తొంద‌న్నమాటే గానీ నితిన్ క‌ళ్లలో ఆ ఆనందం లేదు. దానికి కార‌ణం… ఈ సినిమాని కొంద‌రు తొక్కేయాల‌ని చూడ‌డ‌మే. అవును… కావాల‌ని ’హార్ట్ ఎటాక్’ సినిమాపై దుష్ఫ్రచారం మొద‌లెట్టార‌ట‌. సినిమా చూడ‌కుండానే ’హార్ట్ ఎటాక్’ బాలేదు, హార్ట్ ఎటాక్ ఫ్లాప్ అన్నార‌ట‌. ఈ మాట‌లు స్వయంగా నితిన్ విన్నాడ‌ట‌. దాంతో చాలా బాధ‌ప‌డ్డాడ‌ట‌. ”ఔను… ఈ సినిమా క‌థేంటో తెలీదు, ఎలా వ‌స్తుందో తెలీదు కానీ హార్ట్ ఎటాక్ బాలేదు, ఫ్లాప్ అయిపోతుంది అని కొంత‌మంది నా ఎదురుగానే చెప్పేవారు. ఇలాంటి ప్రచారాలు చాలా జ‌రిగాయి. ఇలా ఎందుకు చేస్తారో అర్థం కాదు. ఓ సినిమాని కావాల‌ని ఇలా తొక్కేయ‌డం అన్యాయం. అందుకే ఎలాగైనా ఈ సినిమా హిట్ కావాల‌ని కోరుకొనేవాడిని. తొలి రోజు  జ‌నం మ‌ధ్య ఈ సినిమా చూశా. వాళ్ల స్పంద‌న చూశాక క‌న్నీళ్లొచ్చాయి. పూరిని గ‌ట్టిగా ప‌ట్టుకొని ఏడ్చేశా. ఆయ‌న క‌ళ్లలోనూ చ‌మ్మ చూశా” అని ఉద్వేగంగా చెప్పుకొచ్చాడు నితిన్. ఇలా నెగిటీవ్ టాక్ తీసుకొచ్చింది ఎవ‌రో మాత్రం చెప్పలేదు. మొత్తానికి మ‌రో హిట్ కొట్టి క‌ష్టే ఫ‌లి అని నిరూపించాడు.

Exit mobile version