Site icon TeluguMirchi.com

Gaami : ‘గామి’ నుంచి శంకర్ మహదేవన్ గాత్రంతో ‘శివమ్’ పాట.. గూస్ బంప్స్ గ్యారంటీ


మాస్ కా దాస్ విశ్వక్ సేన్, విద్యాధర్ కాగిత దర్శకత్వంలో చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గామి’. ఈ అడ్వెంచర్ డ్రామాని వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు. కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు.. సినిమాపై హైప్ ను క్రియేట్ చేసాయి. తాజాగా ఈరోజు శివమ్.. స్పిరిట్ ఆఫ్ గామి పేరుతో మరో పాటను విడుదల చేసారు మేకర్స్.

ఈ పాటను శ్రీశైలంలో గ్రాండ్ గా లాంచ్ చేసారు. ‘నీలోని యుద్ధం శివమ్.. నీతోనీ యుద్ధం శివం’ అంటూ సాగిన ఈ పాట ఈసినిమాకి హైలైట్‍గా నిలిచేలా కనిపిస్తోంది. ఈ పాటను నరేష్ కుమారన్ కంపోజ్ చేయగా, దిగ్గజ గాయకుడు శంకర్ మహదేవన్ పాడారు. శ్రీమణి లిరిక్స్ అందించారు. శంకర్ మహదేవన్ గాత్రంలో ఈ పాటను వింటుంటే గూస్ బంప్స్ రావడం ఖాయం. ఈ చిత్రంలో హారిక పెడదా మరియు మహమ్మద్ సమద్ ఇతర ప్రముఖ తారాగణం. ఇకపోతే ఈ సినిమాకి క్లౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమకూర్చారు. అంతేకాదు విశ్వక్ సేన్ తన వంతు సపోర్ట్ గా ఈ సినిమాకి ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడంలేదు.

Shivam - The Spirit Of Gaami Lyrical Video | Vishwak Sen | Vidyadhar | Shreemani | Naresh Kumaran

Exit mobile version