Site icon TeluguMirchi.com

‘1’లో లేనిది.. ’ఎవడు’లో వున్నది ఏంటీ.. ??

charan-maheshమహేష్ ‘1-నేనొక్కడినే’ టెక్నికల్ పరంగా సూపర్భ్. మహేష్ నటనకు పేరు పెట్టలేం. మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీన్స్ తో కట్టిపడేశాడు. హీరోయిన్ కృతి సనన్ ఫర్లేదు. భారీ బడ్జెట్ తో మరింత భారీ టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కింది ’వన్’. అయినా.. ’వన్’ తెలుగు ప్రేక్షకులకు రుచించడం లేదు. మరోవైపు, పాత చింతకాయపచ్చడిలా వున్న ’ఎవడు’కు ప్రేక్షకాధరణ లభిస్తోంది. అసలు ‘1’లో లేనిది ’ఎవడు’లో వున్నది ఏంటీ.. ?? అంటే.. ’కామేడీ’ యే అంటున్నారు సినీ విశ్లేషకులు.

భారీగా వున్న ’వన్’లో కామేడీ బాగా మిస్సయింది. పైగా నిడివి, ట్విస్టులు రెండు కూడా ఎక్కువే. దీంతో.. ప్రేక్షకుడు కనెక్ట్ కాలేకపోయాడు. ఇక, ’ఎవడు’ ఎప్పటిలాంటి సినిమానే అయినా.. కామేడీ కాస్త పండింది. గందరగోళానికి గురిచేసే రేంజ్ లో ట్విస్టులు లేవు. ఈ కారణంగా ’ఎవడు’ ఎవరికి తలనొప్పి కలిగించలేదు. ’వన్’ కాస్త కామెడీ దట్టించి వుంటే.. మరో రేంజ్ లో కాసుల వర్షం కురిపించేదే. ఏదేమైనా.. తెలుగు ప్రేక్షకుడికి కావాల్సింది.. కాసింత హాస్యం.. కథను కన్ఫ్యూజన్ చెప్పడంమేనని మరోసారి స్పష్టం అయింది.

Exit mobile version