తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన కొందరు నటీ నటులం కలిసి అప్పట్లో బ్రహ్మానందం పేరుతో ఒక అసోషియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అసోషియేషన్ నిధుల విషయంలో గొడవ జరిగింది. బ్రహ్మానందం ఆ నిధులను కాజేశారు అనే టాక్ వచ్చింది. అప్పుడు నేను ఆ డబ్బులు ఏమయ్యాయి అంటూ బ్రహ్మానందంను నిలదీశాను.
ఈ పంచాయితి కాస్త మోహన్‌బాబు హీరోగా నటిస్తున్న శ్రీరాముయ్య చిత్ర నిర్మాత, ఎమ్మెల్యే అయిన పరిటాల రవి వరకు వెళ్లింది. మోహన్‌బాబు నాకు ఫోన్ చేసి షూటింగ్ స్పాట్‌కు రమ్మని పిలిచారు. నన్ను అక్కడకు వెళ్లవద్దని శ్రీహరి వారించారు. సీరియస్ వాతావరణం ఉంది, నువ్వు వెళ్లక పోవడం మంచిది అన్నారు. అయినా కూడా నేను వెళ్లాను. అప్పుడు మోహన్‌బాబు గారు షూటింగ్‌లో ఉండగా, పరిటాల గారు కుర్చిలో కూర్చుని ఉన్నారు. పరిటాల నాతో ఎందుకమ్మా గొడవలు.. కామ్‌గా ఉండండి అన్నారు.
మోహన్‌బాబు కొద్ది సమయం తర్వాత వచ్చి ఇంతకు ఏంటి గొడవ అని అడిగారు. అప్పుడు చిన్న గొడవ అన్నయ్య మాట్లాడుకున్నాం అది కాస్త సర్దుమనిగింది అంటూ చెప్పాను. అయితే వెరి గుడ్ వెళ్లు అన్నారని శివాజీ రాజా చెప్పుకొచ్చాడు. అప్పట్లో పరటాల రవి పలు పంచాయితీలు సినిమా పరిశ్రమకు సంబంధించినవి చేశాడు అనే టాక్ ఉంది.